Skip to main content

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు


మీ దంతాలను బ్రష్ చేయండి
 ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం .
సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం
కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం .
ఆహారం-ఎంపిక
ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక్కర పదార్థాలు శరీర బరువును పెంచడం , నిద్ర తగ్గడం లాంటి  అనారోగ్యానికి గురిచేయవచ్చు. ఇటువంటి ఆహారానికి బదులుగా కూరలు,పండ్లు లేదా తృణ ధాన్యాలను తీసుకోవచ్చు  తద్వారా మీరు ఆరోగ్యకరంగా ఉండగలరు.
ఉప్పు
ఉప్పులేని ఆహారాన్ని ఊహించలేము . నిత్యావసరాల్లో ఉప్పు ఉండాల్సినదే . ఉప్పు మన ఆహారంలో ఎంతలా చొచ్చుకు పోయినదంటే అసలు ఉప్పులేని ఆహారాన్ని ఊహించడం కష్టం . పూర్వపు రోజుల్లో ఆహార సమాత్యులత పాటించేవారు కాబట్టి ఆరోగ్యవంతంగా ఉండేవారు . నేటి మన జీవనశైలిలో ఉప్పు వాడకం అధికమైనది. ఉప్పుని అధికంగా వాడటం వలన ముతపిండాలు ,గుండెపోటు,రక్తపోటు గుండె జబ్బులు , ఎముకల అనారోగ్యానికి దారితీస్తుంది . కాబట్టి ఉప్పును మితంగా వాడటం వలన జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
మస్తకాకానికి-పుస్తకం
మన శారీరక ఆరోగ్యం ఎంతముఖ్యమో అదే విధంగా మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము . మనసును చురుకుగా గా ఉంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి . కొత్త అభిరుచులను అలవాట్లను ఏర్పరచుకోవడం ,పజిల్స్ ఆడటం లాంటివి అబ్యాసం ,పునరావృతం కూడిన పనులు ఏవైనా మనసునును చురుకుగా ఏకాగ్రతతో ఉండటానికి సహాయ పడతాయి . దురదృష్టవశాత్తు మానసిక శిక్షణ ఇచ్చేవారు దొరకడం కష్టం . ఈ లోటును కొంతవరకు పుస్తకాలు తీరుస్తారు. స్మార్ట్ ఫోన్లు , ట్యాబ్లేట్ పిసి ల ద్వారా వందలాది పుస్తకాలనను మన చేతిలో ఉంచుకున్నట్టు అవుతుంది . మీరు ఎక్కడ చదివారన్నది కాదు . చదువుతున్నామా లేదా అనేదే ముఖ్యం . పుస్తక పఠనాన్ని అలవర్చుకుంటే మస్తకం మీ అదుపులో ఉంటుంది .
చేతులు శుభ్రపరచుకోవడం
పరిశుభ్రంగా ఉండటం చాల ముఖ్యమైన విషయం అని మనకు తెలిసినప్పటికీ దాన్ని అంగీకరించడానికి ఇష్టపడము . మన శరీరంలో అతి మురికిగా ఉండే భాగము మన చేతులు . ప్రతి నిత్యమూ; మనం తలుపులు,రైలింగులు , హడిల్స్ ,మరుగుదొడ్లు , సింకులు అనేకమైన వాటిని తాకుతాము తద్వారా మన హస్తాలను రోగకారక క్రిములకు ఆవాసాలుగా మారుస్తాము . ఈ క్రిములు గోళ్లను కొరకడం,తినడం,వేళ్ళను చప్పరించడం ద్వారా మన దేహం లోనికి ప్రవేశించి అనారోగ్యానికి కారణం అవుతాయి. కాబట్టి హ్యాండ్ శానిటైజ్ లను వాడటం ద్వారా రోగకారక క్రిముల వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఆరోగ్యకరమైనరోజుకు-సరైన అల్పాహారం
మంచి అల్పాహారం మంచి రోజుకు దారితీస్తుంది . పిల్లలని చూసుకోవడం , పని  ఇతరత్రా కారణాల వల్ల ప్రజలు ముఖ్యమైన ఆహార విషయాలను తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది
కానీ అల్పాహారంలో  అరటి పండు వంటి ఆరోగ్యకరమైన పండ్లను అల్పాహారంగా తీసుకోవడం వలన మీరు  రోజు లో  తేడాను గ్రహించగలుగుతారు ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం వలన మీరు మరింత అప్రమత్తంగా మరింత శక్తివంతంగా తయారవుతారు మరియు తక్కువ ఒత్తిడి చిరాకు గురవుతారు కాబట్టి మీ జీవన శైలికి సరిపోయేటువంటి అల్పాహారాన్ని కనుగొనండి.
మానసిక దృడత్వం కోసము-ధ్యానం
ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. అలాగే దీనిని మత సంప్రదాయాలకు అతీతంగా కూడా సాధన చేస్తున్నారు. వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం మొదలుకుని అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకత లేదా స్వీయ-స్పృహ లేదా సాధారణంగా ఒక విశ్రాంత మరియు ప్రశాంతమైన మనస్సును పొందడం వంటి లక్ష్యాలను సాధించవచ్చు.దీనికి విభిన్న మార్గాలున్నవి . కానీ ప్రారంభించడానికి ఉత్తమైన సరళమైన మార్గాలను క్రింది దశలద్వారా కనుగొనవచ్చు
గంభీరంగా ఉండే స్థలాన్ని కనుగొనండి ఇది ఎక్కడైనా  ఉండవచ్చు అది ఇల్లు లేదా ఆఫీస్ లేదా ఉద్యానవనం కావచ్చు ఏదైనా  స్థలాన్ని  ఎంపిక చేసుకోవడం ముఖ్యమైనది.
ఏదైనా నేపధ్య శబ్దాన్ని సాధ్యమైనంతవరకు పునరావృతం అయ్యేలా మరియు సహజంగా ఉండేలా చూసుకోండి ఇది పక్షుల కిలకిలలు లేదా  గాలి కదలికల  ఇలాంటి మనసును ఉత్సాహపరిచే శబ్దాలను ఎంపిక చేసుకోవచ్చు.
జాగ్రత్తగా ఉండండి .  మీకు ఏ విధమైన భంగిమ  అనుకూలంగా  ప్రశాంతంగా గా  అనిపిస్తుంది అని అనుకుంటే ఆ భంగిమలో ధ్యానాన్ని ప్రారంభించవచ్చు
ధ్యానాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి  ఒక మాట  లేదా ఒక మంత్రాన్ని పునరావృతం చేయండి తద్వారా మనసు ఏకాగ్రత కోల్పోకుండా ఉంటుంది .
మీ ఆలోచనలు గందరగోళాన్ని సృష్టిస్తే చింతించకండి . ధ్యానము లో నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది .
వ్యాయామం యొక్క ప్రయోజనాలు
 ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఎవరూ కాదనలేని వాస్తవం. వాస్తవ జీవితం లో  దీన్ని ప్రజలు విస్మరిస్తున్నారు . రోజు 30 నిమిషాల వ్యాయామం ద్వారా పని తీరును మెరుగుపర్చుకోవచ్చు . ప్రతి రోజు మీ దినచర్యను ఆరంభించడానికి ఉందయాన్నే నడక అలవాటు ఎంతో ఉపకరిస్తుంది మరియు ఇది అన్ని వ్యాయామాలకన్నా ఎంతో సులభం .
ప్రతి నిత్యం వ్యాయామం వలన గుండెజబ్బులు ,రక్తపోటు మరియు కాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టవచ్చు . వ్యాయామము కండరాలను మరియు ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది . నిత్యం వ్యాయామం వలన ఒత్తిడి తగ్గుతుంది మరియు స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది . చక్కటి వ్యాయామము వలన ప్రతికూల ఆలోచనలు తగ్గడమే కాకుండా మంచి నిద్రకూడా అలవడుతుంది .
ప్రమాదకారి -చక్కెర
ధూమపానం,జూదము మరియు మరకద్రవ్యాలు చెడు అని  ప్రజలు అనుకుంటారు. నిజానికి చక్కెర కూడా ఎక్కువగా తీసుకుంటే ఒక విధంగా మరకద్రవ్యమువంటిదే. సహజంగానే మనం తీపి లేదా చక్కెరకు ఎక్కువ ఆకర్షితులం అవుతాము . మితంగా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ నేటి ఆధునిక సమాజంలో దాదాపు ప్రతి పదార్థంలో చక్కెరను వాడుతున్నారు .
అధిక చక్కర వినియోగం వలన బరువుపెరుగటం ,గుండె సంభందిత వ్యాధులు ,మధుమేహం లాంటి వ్యాధులకు కారణం అవుతుది. చెక్కెరను తగు మోతాదులో వినియోగించుకోవడం ద్వారా  చక్కర యొక్క దుష్ప్రభావాలనుండి బైట పడవచ్చు .
ఆటంకం లేని నిద్ర
ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరము . మన నిద్ర యొక్క తీరు మన పనితీరుపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి. వైద్యులు పెద్దలకు 8 గంటల అంతరాయం లేని నిద్రను సూచించారు. పిల్లలు మరియు టీనేజర్ ల లో కొంచెము ఎక్కువ నిద్ర సూచించడం జరిగింది . అంతరాయం లేని నిద్రనుపొందడం ఎల్లప్పుడూ అంతసులువు కాదు . నిత్యజీవితములో పనులు ,పిల్లలు ఇతరత్రా పనులు భాద్యతలు అప్పుడప్పుడుమంచి నిద్రకు ఆటంకంగా ఉంటాయి. కాబట్టి నిద్రకు భంగం కలిగించే ప్రధాన సమస్యల ఫై దృష్టి సారించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి .
పగలు కాస్త విశ్రాంతి తీసుకునేందుకు కొంత వ్యవధిని కేటాయంచాలి . ఒకవేళ నిద్ర ఆటకంకానికి వత్తిడి కారణము అయితే ధ్యానమ్ లేదా తేలిక పాటి  వ్యాయామం ఉపకరించవచ్చు .
ధూమపానం ఆరోగ్యానికి హానికరం
ధూమపానం ప్రపంచంలో అతి పెద్ద సమస్య ముఖ్యంగా ఇండోనేషియా దేశంలో . అక్కడ మరణాల సంఖ్యలో 17 శాతం మగవారు ,7 శాతం ఆడవారు కేవలం ధూమపానం మరియు సంభందిత ఉత్పతుల వలన మరణిస్తున్నారు . అక్కడ ప్రతి సంవత్సరం 2లక్షల మంది ధూమపానం వలన కలిగే జబ్బులద్వారా మరణిస్తున్నారు . ధూమపానం వలన ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ప్రమాదకర కేన్సరు,మధుమేహం,గుండె వ్యాధులు ,అంగ స్తంభన ,గర్భవిచ్ఛిన్నం 
 మరియు శరీరాన్ని బలహీన పరిచే వ్యాధులకు కారణం అవుతున్నది .
ధూమపానం చేసేవారు కేవలం వారి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేస్తూ పక్కవారి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. పిల్లలపై ఇది మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది .
ధూమపానాన్ని వదిలిపెట్టడం వలన మంచి లాభాలు ఉన్నాయి మరియు ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది . కాబట్టి పొగ త్రాగటం విడిచిపెట్టండి ఈ రోజే .
శరీరానికి సూర్యరశ్మి
వైవిధ్యత ఆరోగ్యముగా ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది . అందుకు ఎండ మినహాయింపు కాదు . ఎక్కువసేపు వేడి ఎండలో గడపడం అంత మంచిది కాదు.
ప్రతి ఉదయం 30 నిముషాలు ఎండలో గడపడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవు . సాధారణంగా ఎండలేకుండా ఉండేవారు మరియు రోజు ఉదయాన్నే సూర్యరశ్మి ని మధ్య ఆరోగ్యంలో తేడాలు శాస్త్రీయంగా నిరూపించ బడినది. మానసిక మరియు శారీరక ఆరోగ్యత కొరకు సూర్యరశ్మి చాలామంచిది . కాబట్టి రోజంతా నీడపట్టున కాకుండా  సూర్యరశ్మిని ఆస్వాదించడం మంచిదే.
ఆరోగ్యకరమైన ఆహారము-పండ్లు-కూరగాయలు
నేటి ఆధునిక పరిశోధనలో  మొక్కల ఆధారిత ఆహారము వలన గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించబడ్డాయి . ఐతే మీకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదలివేయవలసిన పనిలేదు.  కానీ ఫలితాలలో తేడా చూడటానికి కేలరీల పద్దతి లోనికి మారండి . ఒకటి లేదా రెండు పండ్లు లేదా కూరగాయలను మీ ఆహారంలో చేర్చడం ద్వారా దీన్ని ప్రారంభించవచ్చు. స్నాక్స్ కు బదులుగా తాజా పండ్లు తీసుకోవచ్చు . భోజనం సమయంలో సాధారణ వంటకాలతో పాటుగా పండ్లతో చేసిన సలాడ్లను చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది . అంతర్జాలములో విభిన్న వంటకాలను మీ అభిరుచికి తగ్గ్గట్టు అందుబాటులో ఉంటాయి.
నీరు-మానవ దేహం
మన శరీరాన్ని నిర్జలీకరణము నుండి కాపాడుకోవడం ఒక పెద్ద సవాలు. మానవ శరీరం 60 శాతము నీటితో నిండి ఉంటుంది కాబట్టి మననము నిరంతరం మన శరీరంలో తగినంత నీటి శాతం ఉందని నిర్దారించుకోవాలి .
నిర్జలీకరణ లేదా డీహైడ్రేషన్ వలన అలసట ,తలనొప్పి ,శరీరం నిస్సత్తువగా ఉండటం ,శరీర ఉష్ణస్థితి కష్టతరంగా మారతాయి. దీనివలన రోజువారీ కార్యకలాపాలు కష్టతరంగా మారతాయి .
శరీరానికి అలసటగ ఎపుడైనా అనిపిస్తే 2గ్లాసుల నీటిని సేవించడం వలన ప్రయోజనము ఉంటుంది .
సాధారణంగా సగటు వ్యక్తి 8 గ్లాసుల నీరు తాగడం సూచించబడినది . ఇది వ్యక్తికీ వ్యక్తికీ మధ్య వ్యత్యాసంతో ఉండవచ్చు . వాతావరణాన్ని బట్టి కూడా  ఈ విషయం మారుతుండవచ్చు

Popular posts from this blog

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంత ఘోస్ట్ లైట్ల మిస్టరీ

 ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది   ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు   పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది.  ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి.  వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు...

Unleash Your Potential with Self-Motivation: To Achieve Your Goals!

10 Compelling Reasons Why Goal Setting Is Critical for Your Success.   Introduction: Have you ever felt like you were stuck in a rut and going nowhere in life? Do you feel like you are just going through the motions without a clear purpose or direction? If so, you are not alone. Many people struggle with finding meaning and purpose in their lives. However, setting goals can change that. In this article, we will explore the importance of setting goals and how it can transform your life. "Setting goals is the first step in turning the invisible into the visible." - Tony Robbins "A goal properly set is halfway reached." - Zig Ziglar "Goals allow you to control the direction of change in your favor." - Brian Tracy Now You UNDRSTAND . Importance of Setting Goals: Setting goals is important because it gives you direction and purpose. It provides you with a roadmap to follow and helps you focus your energy and efforts towards achieving what you want in life. With...