Skip to main content

Posts

Showing posts from November, 2019

నరేంద్రమోదీ వల్ల నాకి పోయారు Machaa !

ఏందిరా అయ్యా ఇది . వింత అనాలా విడ్డురం అనాలా , పోయే కాలం అనాలా . యూత్ గలీజు ఉన్నరు అన్నవాళ్ళకి సమాధానం అనల్న . సరే తీ... ఈ ముచ్చట చదివినాక నువ్వేమనుకుంటే అది.ఇంతకీ ముచ్చట ఏందంటే .. ఉత్తరప్రదేశ్ ల రెండు కుటుంబాలు లగ్గానికి తయారైనరు . మంచిగా దబాయించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు . ఇగో ఇడ షురూ ఐనది ముచ్చట .. అరె లగ్గం అంటే ఏంజేస్తరు .. ఆడాళ్ళు ఐతే ఏ చీర గట్టాలే , ఏ నగ బెట్టాలి అని సొచ్చాయిస్తనే ఉంటారు .ఇంక పోరి .. పోరడు ఐతే దొంగచాటు ముచ్చట్లు చెప్పుకుంటారు .. ఫోన్ల చాటింగులు జేస్తరు .ఇగో ఇడ మాత్రం నరేంద్ర మోదీ సారు గురించి పెండ్లి కొడుకు పెండ్లికూతురు ముచ్చట్లు లేవనెత్తిర్రఅట .. కొంతవరకు ముచ్చట బానే నడిచిందిగాని .. కొంత సేపు అయ్యాక ఆయన గొప్ప అని ఒకళ్ళు కాదని ఇంకొళ్ళు తన్నుకు సచ్చి .. ఆగం ఆగం చేసుకున్నర.ఏందిరయ్యా అని విషయం తెలుసుకున్న పెద్దోళ్ళు .. గీళ్ళు పెండ్లి గాక ముంగటే ఇట్లుంటే తరవాత ఏమైతదో అని సోచాయింఛి .. పెండ్లి రద్దు చేసుకున్నరు .పెండ్లి.. పెటాకులు గానికి చాల విషయాలు ఉంటాయని దెల్సు గాని . ఇట్ల మోదీ సాబ్ కారణం ఐతడని ఎవ్వరు ఉహించివుండరు . విషయం తెల్సిన జనాలు ముక్కున వెలేసికొని .....

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు

మీ దంతాలను బ్రష్ చేయండి  ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక...