Skip to main content

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంత ఘోస్ట్ లైట్ల మిస్టరీ

Interesting-telugu-facts-ghost-lights-in-indo-pak-border-rann-of-kutch-mystery-explained-in-telugu

 ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది  

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు  పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది. 

ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి. 

వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు. “చైర్” అంటే దయ్యాలనీ... "బత్తి" అంటే దీపాలు అనీ... అర్థం. అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే... కొరివి దయ్యాలంటారే అవన్నమాట.

“చైర్ బత్తి" అనే మాట పూర్వం కుచ్ ప్రాంతంలో వాడుక భాషగా ఉన్న సింధి భాషలోని మాట. దయ్యాలే ఇలా లైట్ల రూపంలో రాత్రిళ్ళు తిరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఇక్కడివారు నమ్ముతున్నారు.“ఘోస్ట్ లైట్స్” అనబడేఫైర్ బాల్స్ ధార్ ఎడారి ప్రాంతంలోని బన్నీ గడ్డిభూమి ప్రాంతంలో ప్రతిరోజూ 8 దాటగానే నేరేడు పండు అకారంలో విచిత్రమైన ఫైర్ బాల్స్ భూమి మీద నుండి ఎగురుతూ... ఒక్కొక్కసారి చాలా నెమనెమ్మదిగానూ, ఒక్కొక్కసారి బాణం కంటే చాలా వేగంగానూ కదులుతుంటాయి. ఈ లైట్లు మెర్యురీ లైట్లలాగా చాలా కాంతివంతంగా వెలుగుతూ తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ఎగురుతూ... విచిత్రంగా 'రంగులు మారుతూ వెలుగుతుంటాయి.

ఈ అద్భుతమైన సంఘటన కొన్ని నిమిషాలపాటు కొనసాగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్క ఫైర్ బాలే కనబడుతుంది. ఇంకొకసారి ఏడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనబడతాయి. మరొకసారి ఒక బాలే రెండుగా విడిపోయి చిత్రవిచిత్రంగా రంగులు మారుతూ చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుందని చూసినవారు చెబుతున్నారు.ఇంకా ఆశ్చర్యపడే

విషయమేమిటంటే... ఈ ప్రాంతంలో అనగా కైరో కొండ ప్రాంతం చుట్టుప్రక్కల ప్రదేశాలలో రాత్రిళ్ళు ఎవరైనా ఒంటరిగా తిరిగితే మాత్రం ఈ ఘోస్ట్ లైట్స్ వారిని వెంబడిస్తూనే ఉంటాయని... ఆ వ్యక్తి అక్కడ దగ్గరలో ఉన్న పూలే అనే గ్రామం చేరే వరకు వెంబడించి ఆగిపోతాయని ఇక్కడి సందర్శకులు చెబుతున్నారు. కానీ ఈ ఘోస్ట్ లైట్స్ వెంబడించినా ఇంతవరకూ ఎవరికీ హాని చేసిన దాఖలాలే లేవని ఇక్కడి వారంటున్నారు.

అంతేకాకుండా ఇంకో విచిత్రమేమిటంటే... ఎవరైనా ఈ ఘోస్ట్ లైట్స్ను ఫాలో చెయ్యాలి అనుకుంటే మాత్రం వారు దారి తప్పి ఉప్పు బురదలుండే ప్రాంతంలోకి గానీ ముళ్ళ పొదల్లోకి గానీ దారి తప్పిపోతారని ఇక్కడివారు అంటున్నారు. ఈ ఘోస్ట్ లైట్స్న దూరం నుంచైనా ఫొటోలు తియ్యాలని గానీ సినిమావారెవరైనా ఈ అద్భుతమైన సంఘటనను షూట్ చెయ్యాలని ప్రయత్నించినా... సఫలీకృతులయినవారు మాత్రం ఎవరూ లేరు.జనసంచారం లేని ఈ ప్రాంతంలో రోజూ జరిగే ఈ అద్భుత సంఘటన వెనుక ఇంకా ఏవేవో కధనాలు గురించి ఇక్కడివారు కథలు కథలుగా చెబుతున్నారు. ఈ ప్రదేశంలో వింత వింత పక్షులు, జంతువులు ఉన్నాయని... వీటిని అధ్యయనం చెయ్యడం కోసం ఎంతో మంది సైంటిస్ట్లు వస్తూ ఉ ంటారని... వారిలో జుగల్ తివారీ అనే వృక్ష శాస్త్రజ్ఞుడు ఈ ఘోస్ట్ లైట్స్ గురించి చెబుతూ... ఈ లైట్లను వంద కంటే ఎక్కువసార్లే చూశానని... ఈ లైట్ల వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని ఎన్నోమార్లు రాత్రిళ్ళు పక్షులను బోనుల్లో పెట్టి ఇక్కడ ఉంచినపుడు రాత్రి సమయంలో తిరుగాడే ఈ ఘోస్ట్ లైట్స్ను చూసి పక్షులు గోలగోలగా అరిచేవని తివారీ చెబుతున్నాడు. మరికొంతమంది అంటుంటారు... ఇక్కడ మిలటరీ క్యాంపులు ఉంటాయి. కాబట్టి... ఈ సరిహద్దు ప్రాంతంలోని రక్షణ దళాలు పగలూరాత్రి గస్తీ కాస్తారు. వీరిని అడిగితే వీరు కూడా ఈ లైట్లను చూడటమే గానీ వీటి గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు.

సైంటిస్ట్లు బన్నీ గడ్డిభూమి ప్రాంతంలో భూమి లోపల రసాయనాలు గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఇలా ఉత్ప్రేరకాలుగా మారి ఫైర్ బాల్స్న సృష్టిస్తున్నాయోనని పరిశోధనలు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ ఘోస్ట్ లైట్స్ వెనుక దాగియున్న మిస్టరీని మాత్రం సమూలంగా ఎవరూ ఇంతవరకూ ఛేదించలేకపోయారు.

Share On WatssApp

Comments

Popular posts from this blog

Unleash Your Potential with Self-Motivation: To Achieve Your Goals!

10 Compelling Reasons Why Goal Setting Is Critical for Your Success.   Introduction: Have you ever felt like you were stuck in a rut and going nowhere in life? Do you feel like you are just going through the motions without a clear purpose or direction? If so, you are not alone. Many people struggle with finding meaning and purpose in their lives. However, setting goals can change that. In this article, we will explore the importance of setting goals and how it can transform your life. "Setting goals is the first step in turning the invisible into the visible." - Tony Robbins "A goal properly set is halfway reached." - Zig Ziglar "Goals allow you to control the direction of change in your favor." - Brian Tracy Now You UNDRSTAND . Importance of Setting Goals: Setting goals is important because it gives you direction and purpose. It provides you with a roadmap to follow and helps you focus your energy and efforts towards achieving what you want in life. With...

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు

మీ దంతాలను బ్రష్ చేయండి  ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక...