మీ దంతాలను బ్రష్ చేయండి ఇది చాల ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్ ల లోని కొవ్వు మరియు చక...