Skip to main content

నోటు - నోటా -ఓటు


అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు.
ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి.
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును NOTA వినియోగించుకున్నట్టే.ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.
ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటువేయాలనే ఉద్ధ్దేశంతో ఓటు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే నోటా అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఉన్నదనే విషయం కనీసం ఓటరుకు తెలియదు. ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులే కనిపిస్తాయి. అభిప్రాయాన్ని యువ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.

Popular posts from this blog

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంత ఘోస్ట్ లైట్ల మిస్టరీ

 ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది   ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు   పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది.  ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి.  వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు...

Unleash Your Potential with Self-Motivation: To Achieve Your Goals!

10 Compelling Reasons Why Goal Setting Is Critical for Your Success.   Introduction: Have you ever felt like you were stuck in a rut and going nowhere in life? Do you feel like you are just going through the motions without a clear purpose or direction? If so, you are not alone. Many people struggle with finding meaning and purpose in their lives. However, setting goals can change that. In this article, we will explore the importance of setting goals and how it can transform your life. "Setting goals is the first step in turning the invisible into the visible." - Tony Robbins "A goal properly set is halfway reached." - Zig Ziglar "Goals allow you to control the direction of change in your favor." - Brian Tracy Now You UNDRSTAND . Importance of Setting Goals: Setting goals is important because it gives you direction and purpose. It provides you with a roadmap to follow and helps you focus your energy and efforts towards achieving what you want in life. With...

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు

మీ దంతాలను బ్రష్ చేయండి  ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక...