Fb ఓపెన్ చేసిన వెంటనే తెర మీద చూపించబడే న్యూస్ ఫీడ్ లో మనకు వందలు లేదా వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి కూడా కేవలం కొద్దిమంది వ్యక్తుల పోస్టులు మాత్రమే చూపించబడతాయి.
Facebook సంస్థ ఇతరుల పోస్టులను మనకెందుకు చూపించదు అనే సందేహం చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో Facebook తాజాగా ఒక సదుపాయం తీసుకువచ్చింది.
Why Am I Seeing this అనే ఆప్షన్ ఒకటి కొత్తగా Facebook news feedలో కన్పించే ప్రతీ పోస్ట్ దగ్గరా ఉండే మెనూలో చూపించబడుతుంది. దీనిని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ నిర్దిష్టమైన పోస్ట్ మీకు news feedలో ఎందుకు కనిపిస్తోందో కారణాలు చూపించబడతాయి.
ఆ వ్యక్తి మన ఫ్రెండ్ లిస్టు లో ఉండటం వల్ల కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క పోస్టులను మనం ఎక్కువగా లైక్, లేదా కామెంట్ చేస్తూ ఉండడం వల్ల కావచ్చు, మనం ఒక నిర్దిష్టమైన పోస్టు దగ్గర ఎక్కువ సమయం గడపడం వల్ల కావచ్చు వాటన్నిటినీ పారామీటర్స్ గా తీసుకుని ఫేస్బుక్ మనకు ఎలాంటి పోస్టులు చూపించాలన్నది ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటుంది.
ఇప్పటివరకు ఈ కారణాలన్నీ బయటి ప్రపంచానికి లేవు. ఫేస్బుక్ తమకు వివిధ పోస్టులను ఏ కారణం చేత అంత ప్రత్యేకంగా ఏ కారణం చేత చూపిస్తుంది అన్నది కూడా చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తాజాగా తీసుకువచ్చిన ఈ Why Am I seeing this అనే సదుపాయం, ఫేస్బుక్ యూజర్లకు న్యూస్ ఫీడ్ మీద మరింత కంట్రోల్ సాధించడం కోసం ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏ వ్యక్తి పోస్టులైనా మీరు ఇకమీదట చూపించకూడదు అనుకున్నట్లయితే.. అదే మెనూలో See First, Unfollow, News Feed Preferences అనే మూడు ప్రధానమైన అంశాలకు సంబంధించిన షార్ట్కట్లు లభిస్తుంటాయి.