ఏందిరా అయ్యా ఇది . వింత అనాలా విడ్డురం అనాలా , పోయే కాలం అనాలా . యూత్ గలీజు ఉన్నరు అన్నవాళ్ళకి సమాధానం అనల్న . సరే తీ... ఈ ముచ్చట చదివినాక నువ్వేమనుకుంటే అది.ఇంతకీ ముచ్చట ఏందంటే .. ఉత్తరప్రదేశ్ ల రెండు కుటుంబాలు లగ్గానికి తయారైనరు . మంచిగా దబాయించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు . ఇగో ఇడ షురూ ఐనది ముచ్చట .. అరె లగ్గం అంటే ఏంజేస్తరు .. ఆడాళ్ళు ఐతే ఏ చీర గట్టాలే , ఏ నగ బెట్టాలి అని సొచ్చాయిస్తనే ఉంటారు .ఇంక పోరి .. పోరడు ఐతే దొంగచాటు ముచ్చట్లు చెప్పుకుంటారు .. ఫోన్ల చాటింగులు జేస్తరు .ఇగో ఇడ మాత్రం నరేంద్ర మోదీ సారు గురించి పెండ్లి కొడుకు పెండ్లికూతురు ముచ్చట్లు లేవనెత్తిర్రఅట .. కొంతవరకు ముచ్చట బానే నడిచిందిగాని .. కొంత సేపు అయ్యాక ఆయన గొప్ప అని ఒకళ్ళు కాదని ఇంకొళ్ళు తన్నుకు సచ్చి .. ఆగం ఆగం చేసుకున్నర.ఏందిరయ్యా అని విషయం తెలుసుకున్న పెద్దోళ్ళు .. గీళ్ళు పెండ్లి గాక ముంగటే ఇట్లుంటే తరవాత ఏమైతదో అని సోచాయింఛి .. పెండ్లి రద్దు చేసుకున్నరు .పెండ్లి.. పెటాకులు గానికి చాల విషయాలు ఉంటాయని దెల్సు గాని . ఇట్ల మోదీ సాబ్ కారణం ఐతడని ఎవ్వరు ఉహించివుండరు . విషయం తెల్సిన జనాలు ముక్కున వెలేసికొని .. అరె పోరగాళ్ళు పెండ్లి లో హనీమూన్ ముచ్చట్లు జెప్పుకోక .. రాజకేయాలే ఏందీ అని గుస గుస లాడుతున్నారు .ఏది ఏమైనా మన యూతు రాజకీయాలపై హుషారున్నారు . బాబు రాజకీయనాయకులు జర జాగ్రత్త .
ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది. ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి. వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు...