![]() |
రిలేషన్ ఏర్పరచు కోవడం యొక్క ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏమిటంటే, అవతల వ్యక్తి మన జీవితం లోకి ప్రవేశిస్తే మన జీవితం పరిపూర్ణగా ఉంటుంది అని భావించడమే . మనం అందరం దాదాపు అటువంటి భాగస్వామ్య వ్యక్తుల కోసమే ఎదురు చూస్తాము. అటువంటి వారు లభిస్తే వారు మిమ్మలి మీ లాగా ఇష్టపడతారు మీ వ్యక్తిత్వం తో వారు కూడా కలిసి పోతారు . ఎంతో సామరస్యంతో సహజీవనం చేస్తారు . అంటే దానర్ధం మీరు మరియు ఆ వ్యక్తి ఒకే రకం లేదా సమానం అని కాదు . ఒకరి కొకరు పరస్పర సహాయ సహకారాలను అందించు కుంటూ ,ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుంటూ మీరు ఇష్టంగా చేసే ఒక అభ్యాసం వంటిది.
మీ
చుట్టూ ఉండేవారు మిమ్మల్ని మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్ అని పొగుడుతుంటే దాని
వెనుక ఉండే ముఖ్య ఉద్దేశం మీరు మీ
భాగస్వామితో సరైన సంభందాన్ని ఏర్పర్చు కోవడంలో విజయం సాధించారని అర్ధం . అయితే ఎంత విజయవంతమైన సంభందాలు కూడా
ఏదో ఒక పాయింట్ లో రాజీ పడవలసి వస్తుంది అయితే మీరు ఎంత దూరం రాజీ పడవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న .
రిలేషన్ షిప్ యొక్క ఉద్వేగభరితమైన ప్రారంభ దశ లో అంటే
మీరు భావోద్వేగ పరంగా ఎంతో ఆనందకరమైన
స్థితి లో ఉన్నప్పుడు, ప్రపంచం మొత్తం ప్రతి విషయం మీ కోసమే
పని చేస్తున్నట్టుగా భావిస్తారు అంటే పక్షులు సహజంగా చేసే శబ్దాలు ,వర్షం , ఆహ్లాదకరమైన
సాయంత్రం , ప్రతి ప్రేమ పాట ఇలా అన్ని ప్రకృతి
సిద్ధంగా జరిగేవి అన్ని మీకోసమే అని ఆ రొమాంటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారు.
ఇవన్నీ మీ ప్రేమకు గుర్తులుగా అనుభూతి చెందుతారు .
ఇవన్నీ సాటిలేని అనుభూతులులాగ భావిస్తారు , మీ రిలేషన్
ఇలాగే సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండాలని ఆశిస్తారు . మీ రిలేషన్ కోసం ఎంతదూరమైనా
పోవచ్చు అనే ఒక బలమైన భావనను కలిగి ఉంటారు
దాన్ని ఎవరు మార్చలేరు . కానీ ఇదిగో ఇక్కడే అసలు సమస్య మొదలు అవుతుంది .
చిన్న మోతాదులో రాజీ పడటం ద్వారా రిలేషన్ యొక్క గడ్డు కాలం లో మంచి ఫలితాలను రాబట్టవచ్చు . ఉదాహరణకి
భాగస్వామి ఫోన్ లో సంభాషించే ప్పుడు టివి ని
మ్యూట్ లో ఉంచడం లేదా ఆపివేయడం ద్వారా
ప్రశాంతం గా సంభాషించే సమయాన్ని
ఇవ్వడం ద్వారా రాజీ పడవచ్చు .
ఇటువంటి రాజీలు మీ లోతైన అవసరాలను ,కోరికలను, సంభందాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి
పునాదులుగా నిలుస్తాయి. మనం ఒక రిలేషన్
లోనికి ప్రవేశించడానికి తెరవెనుక మనకు తెలియని
ముఖ్య ఉద్దేశం మరియు కారణాలు
ఇవే. ఇటువంటి లోతైన విషయాల్లో తేడాలు వస్తేనే రిలేషన్ లో సమస్యలు
తలెత్తుతాయి.
ఆరోగ్యకరమైన
ప్రతి రిలేషన్ భగస్వామి యొక్క
ప్రతి అవసరాన్ని గుర్తించుకుంటూ పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ఉండాలి .
అర్థవంతమైన చర్చ ఉండాలి కానీ వాదనలు కాదు . ఒక్కో సందర్బములో ఒకరు రాజి పడితే
సరిపోతుంది కానీ మరో సందర్భంలో ఇద్దరు రాజీ పడవలసి ఉంటుంది . అన్నిటి సిద్దపడి
ఉండాలి అటువటప్పుడే ఆ సంభందం మీకు దాసోహం అంటుంది లేకపోతె అదే సంబంధం మీకు
ప్రతికూలంగా మారవచ్చు
రిలేషన్ షిప్ లో
ప్రజలు అధికంగా రాజి పడే రెండు
విషయాలను జాబితా గురించి ఉదాహరిస్తే ఒకటి
భావోద్వేగాలు రెండవది శారీరక సాన్నిహిత్యం
ఈ రెండు విషయాలలో ఎక్కువగా మనం రాజీ
పడతాము అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి . కాబట్టి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములిద్దరికి ఒక
విషయం మీద మాత్రమే ఆసక్తి ఉండవచ్చు లేదా రెండు సమానము ఐన ప్రాధాన్యతగా
కలిగివుండవచ్చు కాబట్టి సమస్యలు తలెత్తవు . ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకుంటూ
ఆనందంగా తమ భాగస్వామ్య బంధాన్ని ముందుకు
తీసుకువెళతారు . వారి పరస్పర కోరికలు తీర్చుకోగలుగుతారు
ఆలా కాకుండా ఈ రెండు విషయాలలో ఒకరికి ఒక విషయం మరొకరికి
మరో విషయం అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నప్పుడు మీ భాగస్వామితో రాజీ కుదరనప్పుడు సమస్యలు తలెత్తుతాయి . దానివల్ల
ఒత్తిడి మరియు ఆవేశం తప్ప ప్రయోజం ఏమి కనబడదు . ఈ సందర్భంలో భాగస్వాముల కోరిక లేదా
అవసరం తీరడం చాల కష్టం అవుతుంది కాబట్టి వారు కలిసి ఒక మార్గాన్ని అన్వేషించాలి .
మన ఇదాహరణ లో మీరు ప్రేమ మైకంలో ఉన్నపుడు శారీరక
మరియు భావోద్వేగ పరమైన అవసరాలు ఒకేసారి తీరుతాయి ఎందుకంటే ప్రేమలో ఈ రెండు
విషయాలు ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి . ఆలా కాకుండా బలవంతపు చర్యలకు ఉపక్రమించడం
ద్వారా మానసిక ఒత్తిడి పెరగటమే కాకుండ
రిలేషన్ దెబ్బతినే అవకాశాలు సృష్టించుకున్న వారు అవుతారు . పరస్పర అంగీకారం మరియు
అర్ధం చేసుకోవడం ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తాయి .
పై విషయమంతా
కఠిన వాస్తవం అని మనకి తెలుసు , కానీ
రిలేషన్ షిప్ లోకి ప్రవేశించిన మొదట్లో మనకి ఇదంతా మనకు తట్టదు లేదా మనకు
వర్తించదు అని నిర్లక్యం చేస్తుంటాము . ఆ సమయంలో ప్రేమ మనకు అత్యంత ప్రాధాన్యత
కలిగిం అంశం అయినా ఇదేమి అంత అసాధారణ అంశం
కాదు . ఇక్కడే అసలు సమస్యలు మొదలు అవుతాయి మీరు ఆ వ్యక్తి ఎన్నో వాగ్దానాలు చేస్తారు వారికోసం ఎన్నో వ్యయ ప్రయాసలు చేస్తారు
అంతిమంగా అవతల వ్యక్తి ఆనందంమే మీకు
ముఖ్యం అవుతుంది . బహుశా అప్పటికి ఇంకా
అవతలివ్యక్తి గురించి పూర్తిగా
కూడా తెలిసి ఉండదు ఎందుకంటే మీ సంబంధం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండి ఉంటుంది
ఎన్నో విషయాలు మీకు తెలియకపోవచ్చు , ఇతరులు
చెపితే మీరు అంగీకరించడానికి నిరాకరిస్తారు, ఇలా స్పష్టత
లేని రిలేషన్ కోసం (దాన్ని మీరు ఒప్పుకో క పోవచ్చు ఎందుకంటే మీకు అన్ని తెలుసన్న భావనలో అప్పటికే ఉన్నారు
కాబట్టి )దానికోసం ఎంతముల్యాన్ని లేదా పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో మీకు
లెక్క ఉండదు . మీరు కళ్ళు తెరచే సమయానికి విషయం మీ చేతుల్లో లేదని గ్రహించడానికి
ఎంతో సమయం పట్టదు . మీ సంబంధాన్ని గాడిలో పెట్టే
ప్రయత్నాలు దాదాపు ఫలించవు, ఎందుకంటే
తెగిన దారం మళ్ళిఅతుక్కోదు. ఇంక మీరు
సమాజం కోసమో లేదా మరి ఏ ఇతర కారణం కోసమో ఆ
సంబంధాన్ని బలవంతగా ముందుకు తీసుకు వెళ్ళడానికి
ఉపక్రమిస్తారు ఇది ఏ మాత్రం మంచి
విషయం కాదు . దానివల్ల మానసిక ప్రశాంతతని కోల్పోవడం జరుగుతుంది , తరువాతి
పరిణామాల గురించి ప్రత్యేకంగా చర్చించవలసిన ఆవాసం లేదు .
కానీ భాగస్వాములు ఇద్దరు పరస్పర అవగాహనతో ఏర్పరచున్న
పరస్పర అవసరాలు ,కోరికలు ,ప్రమాణాలను
నిలకడగా ఉంచడానికి రాజీ అనే అంశం మంచి
అస్త్రం గా ఉపయోగపడుతుంది . మీరు చేయవలసిందల్లా అడుగు ముం దుకు వేయడమే .
చివరిగా మీరు ఎటువంటి రిలేషన్ లో ఉన్నప్పటికీ చిన్న చిన్న రాజీలు అవసరమే
కానీ మీరు అప్పటికే ఏర్పరచుకున్న
అభిప్రాయాలను ,విషయాలను ,బాంధవ్యాలను
ఆ రిలేషన్ ని నిలబెట్టడానికి వదులుకోకుండ ఉండేందుకు జాగ్రత్త వహించండి ,ఎందుకంటే
మీ వ్యక్తిత్వ పునాదులు అక్కడ నుండే
ఏర్పడ్డాయి .

Comments
Post a Comment